ప్రతినెలా రూ.6 వేల కోట్లకుపైగా రేవంత్ సర్కార్ అప్పు
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో దింపడ మే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ తాజాగా రిజ ర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.4,000 కోట్ల అప్పు తీసుకున్నది. సె క్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవా రం ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 17 ఏండ్ల కాలపరిమితితో 7.90 వార్షిక వ డ్డీకి రూ.2,000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితితో 7.88 వార్షిక వడ్డీకి మరో రూ.2,000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ వె ల్లడించింది. దీంతో 2026-27లో ఇప్పటివరకు తీసుకున్న అప్పు రూ.16,900 కో ట్లు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు అ ప్పు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదన లు సమర్పించిన సర్కార్..
ఏప్రిల్‌లో రూ.6,900 కోట్లు, మే నెలలో రూ.6 వేల కోట్లు, ఇప్పుడు రూ.4 వేల కోట్లు అప్పు తీ సుకున్నది. మిగిలిన రూ.2, 000 కోట్ల రు ణాన్ని కూడా ఈ నెలలోనే సమీకరించబోతున్నది. ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర తినెలా బహిరంగ మారెట్ నుంచి సగటు న రూ.6,000 కోట్లకుపైగా అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్టు స్పష్టమవుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఓపెన్ మారెట్ రుణాల రూపంలో రూ.85,840 కోట్లు తీసుకున్నది.