Select Location
All Locations
State
Region
City / District
వారం రోజులు తెలంగాణలో వర్షాలు... రేపు ( జూన్ 6 ) భారీ వర్షం కురిసే ఛాన్స్...!

వారం రోజులు తెలంగాణలో వర్షాలు... రేపు ( జూన్ 6 ) భారీ వర్షం కురిసే ఛాన్స్...!

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జననానికి చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాబోయే ఐదు రోజుల పాటు ( అంటే.. జూన్ 6 నుండి 10వ తేదీ వరకు ) తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా శనివారం ( జూన్ 6 ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

రేపు భారీ వర్షాలు: దక్షిణ తెలంగాణతో పాటు దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఏపీ, యానాం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి. మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు నుండి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్.. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్ జిల్లాలలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న నాలుగు రోజులు వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుండి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

Source : V6 News

2 hours ago

Home Flash News