Select Location
All Locations
State
Region
City / District
తెలంగాణలో 'పెద్ది' టికెట్‌ ధరలు పెంపు

తెలంగాణలో 'పెద్ది' టికెట్‌ ధరలు పెంపు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) జారీ చేసింది. గత కొన్ని రోజులుగా మల్టీప్లెక్స్‌లలో రూ. 150 వరకు ధర పెరగవచ్చని ప్రచారం జరిగినప్పటికీ, ప్రభుత్వం మాత్రం మల్టీప్లెక్స్ టికెట్లపై రూ. 125 పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయానికి వస్తే, టికెట్ ధరను రూ. 100 మేర పెంచారు.

ఈ తాజా పెంపుతో తెలంగాణ వ్యాప్తంగా సవరించిన సరికొత్త టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ. 275 కాగా, మల్టీప్లెక్స్‌లలో ఈ ధర రూ. 420 కి చేరింది. వీటితో పాటు రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ప్రీమియర్ షోల టికెట్ ధరను గరిష్టంగా రూ. 600 గా నిర్ణయించారు. ఈ ప్రత్యేక ధరలు జూన్ 4వ తేదీ నుంచి ప్రారంభమై, తదుపరి పది రోజుల పాటు అమలులో ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Source : Smacy News

1 hour ago

Home Flash News